Monday, November 23, 2009

అబద్దాల దండయాత్ర


ఆర్యులు మధ్య ఆసియా నుంచో, మరోచోటి నుంచో వెళ్ళి ఇండియా మీద దాడి చేశారని..... లేదా అలలు అలలుగా వెళ్ళి ఇండియాలో క్రీ.పూ. 1500 ప్రాంతాల్లో వారు సౌమ్యంగా స్తిరపడ్డారని ప్రపంచంలో ఇప్పుడు ఎవరు నమ్మడం లేదు. అంతకు పూర్వం దేశంలో విలసిల్లిన అనార్య ద్రావిడ నాగరికత ఆర్యులు ద్వంసం చేశారనడం శుద్దాబద్దమని, మొహొంజొదారో హరఫ్ఫాలలో బయల్పడినది స్వచ్హమైన వైదిక సంస్క్రుతేనని ..ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ, జియాలజీ,ఆస్ట్రానమి తదితర ఆధునిక శాస్త్రాలు ముక్తకంటంతో చాటాయి... ...... క్రీ.పూ.3000 సంవతరాల నాటివనుకుంటున్న హరప్పా శిధిలాలు కాలమం లోనే వేద నాగరికత పుట్టిందని అనుకోనక్కరలేదు ...ఆర్కియాలజీ తవ్వకాలలో వేద సంస్మతి ఎంత ప్రాఛీనమో క్రమక్రమంగా తెలిసి వచ్హింది.కాస్తా కూస్తా కాదు,,,,,కనీసం పదిహేను లక్షల చదరపు కిలోమీటర్ల విశాల ప్ర్రాంతంలో ఈ నాగరికత వర్ధిల్లిందని, ప్రాచీన ఈజిప్ట్ట్, మొసపొటేమియా నాగరికతలు రెంటినీ కలిపినా పరిమానంలోనూ దీనికి సాటిరావని శాస్త్రీయం గా రుజువైంది. ఈ వేద నాగరికత ఉచ్హస్తితిలో వెలిగిపోయిన సమయాలు క్రీ.పూ.6500 నాటి ( ప్రస్తుత పాకిస్తాన్ లోని) మొహర్గడ్ తవ్వకాల్లో బయటపడడంతో హరప్పా కాలానికి కనీసం నాలుగువేల సంవతరాలకు పూర్వం నుంచే ( అంటే ఇప్పటికి తొమ్మిది వేల సంవతరాలకు పూర్వమే) సింధు - సరస్వతి నాగరికత అవిచ్హిన్నంగా, అఖండంగా విలసిల్లిందని స్పశ్టమైనది.....ప్రపంచంలో ఏ జాతికైనా ఇది గర్వించదగిన గతం...

                ప్రాచీన కాలంలో వలస నిజమే కాని అవి బయటి నుంచి ఇండియాలోకి కాక......ఇండియా నుంచే బయటికి జరిగాయి..ప్రపంచమంతా తాండవించిన ఫ్రక్ర్రితి వైపరీత్యాల మూలంగా, జలవనరులు క్రమేణా వట్టిపోయిన పర్యవసానం క్రీ.పూ.౪౦౦౦ ముందు నుంచే తూర్పు .నుంచి పడమరకు ఆర్య సంతతి వారు వలసపొసాగారు.క్రీ.పూ.౧౯౦౦ నాటికి సరస్వతి నది పూర్తిగా ఎండిపోవడంతో ఇరాన్, పశ్చిమ ఆసియా తదితర ప్రాంతాలకు వలస ముమ్మరమయ్యాయి. పశ్చిమ ఆసియాలో దొరికిన పురాతన రికర్డ్లను బట్టి, ప్రాచీన ఇరానియన్ గాధలు, సారస్వతాలను బట్టి ఈ సంగతి ద్రువపడింది....
                               ఈ ప్రకారంగ ఇటు నుంచి అటు వెళ్ళిన ఇండో - ఆర్యన్లే మనం ఇండో - యూరొపియన్ జాతులనుకునే వాటికి మూలపురుశులన్న చరిత్రక సత్యం కల్లెదుట కొట్టొచ్చినట్టు కనపడుతున్నా...అది వాస్తవమని విదేశీ చరిత్రకారులు సైతం అంగీకరించినా.... చరిత్రకారులుగా చలామణి అవుతున్న మన మహామేధావులు మాత్రం ఇంకా అటు నుంచి ఇటు ఆర్యుల దండయాత్ర సిద్దాంతము పట్టుకుని వేలాడుతున్నారు

అబద్దాల అంకయ్యకు అరవై నాలుగు అసత్య ప్రమాణాలని సామేత. ఆర్యుల సిద్దాంతానికి ఇదే బాపతు. మాయోపాయాలతో పాపభీతి లేకుండా తెగబడి ఇండియాను ఆక్రమించిన తెల్లదొరలు భారతీయులను మానసికంగా బానిసలను చెసుకోవడం కోసం తమకు అనువుగా అవాస్తవ చరిత్రను విశ్వామిత్ర స్రుశ్టి చేయబోగా తయరైంది ఆర్యుల గురించి మిధ్యావాదన. నల్లవారైన ఆసియా, అప్గ్రికా వాసులపై తెల్లవారైన తాము పెత్తనం చెలాయిస్తున్నాము గనుక ప్రాచీన కాలంలోనూ అలాగే జరిగి ఉండాలని అగ్లేయులు ఊహించారు..అదే ప్రకారం ఇండో - యూరొపియన్ సంతతి వాలయిన ఆర్యులు అనే సుకుమారపు తెల్లతోలువారు క్రీ.పూ.౬౫౦౦లో ఇండియా మీద దండెత్తి అక్కడి అనాగరికత, అజ్గ్నానపు నాగరికత నేర్పి అక్కడే స్తిరపడ్డారని ౧౯ వ శతాబ్ధం చరిత్ర పాటాలలొ రాయించారు. ఆ విధంగా పుట్టిన ఆర్యులు దండయాత్రా సిద్దాంతానికి శాస్త్రీయ ప్రాతిపదిక ఏదీలేదు. అసలా కాలానికి పురావస్తు తవ్వకాలు....శాస్త్రీయ పరిశోదనలు లేవు.

అలా కొన్ని తరాలు గడిచాక మొహొంజొదారో హరఫ్ఫాల్లో తవ్వకాలు జరిగాయి... క్రీ.పూ.౬౫౦౦లో నాటికి అంటే అగ్లేయులు పుట్టించిన ప్రకారం బుగ్వేద ఆర్యులు ఇండియా చేరడానికి వెయ్యి సంవతరాల ముందే ఇండియాలో తెల్లవారికి సైతం కళ్ళు తిరిగేంత అధ్భ్త్ తమైన నాగరికత వర్ద్దిల్లిందని వాటివల్ల వెల్లడైంది, అది సినలైన వైదిక నాగరికత అన్ని సంగతి దాని మొహం మీదే రాసి ఉంది.

తప్పులో కాలు వేసామన్న సంగతి గుర్తించి, తాము ఆల్లింది కట్టుకధ అని ఒప్పుకుని..... తెల్ల నల్ల కల్లలతో నిమిత్తం లేకుండా భారతదేశంలో కొన్ని వేల సంవతరాలు ఉజ్వలమైన వేద నాగరికత విరసిల్లిందన్న సంగతి అగ్లేయులు ఒప్పుకుని వుంటే ఏ గొడవ లేకపోయేది.... కాని....ఆ తప్పు కప్పుపుచ్చుకోడానికి తెల్లదొరలు, వారికి విధెయులైన ఇండాలజిస్టులు ఇంకో కధ అల్లారు...తవ్వకాలలో బయల్ఫడిన నాగరికత వేద సంబందమయినది కాదని.... అనారులైన ద్రావిడులదనీ....వారిని బయటి నుంచి వచ్హిన అనాగరిక ఆర్య తండాల వారు ఓడించి, వారి నాగరికతను నాశనం చేసి ఆ తరువాత ఎప్పుడో తీరిగ్గా వేదాలు ఆసుకున్నారు అనీ ప్లేటు మార్చారు

Friday, November 20, 2009

ప్రఫంచంలో మనకూ మిగతా వారికి తేడా ఏమిటి???

ఓ ఇంగ్లీషు వాణ్ని పిలిచి ఇప్పటిదాకా మీరు అనుకుంటున్న దాని కంటే మీ దేశచరిత్ర కొన్ని వేల యుగముల నాటిది అని చెప్పండి .... మీ నాగరికత ఎంతో గొప్పది .....మీ పూర్వికులు మహామేదావులు అని ఓ జర్మన్ తోనో, రష్యన్ తోనో అనండి... అసలు ప్రఫంచం నాగరికత మీతోనో మొదలయ్యింది... లోకానికి వెలుగు చూపింది మీరే..... అందుకు ఇవిగో రుజువులు అని అని ఏ డచ్చి వాడికో చెవిన వెయ్యండి ...ఎగిరి గంతేస్తారు . సంతోషం పట్టలేక మిమ్మలిని కేగలించుకొని నోట్లో చక్కేర పోస్తారు ....ఇదిగో విన్నారా అంటూ ఆ ఊసును ఊరంతా దండోరా వేయడానికి తక్షనమే పరుగు తీస్త్తారు ..

అవే సంగతులు వరసబెట్టి ఓ భారతీయ మేధావికి చెప్పండి. చస్తే నమ్మడు..... మిమ్మలిని ఎగాదిగా అనుమానంగా చూసి సనాతన చాంధసుడిగా....కాషాయంళ్ళ ఏజెంటువా? పురాణాల నుంచి లేచివచ్హావా?? అని చడామడా ఆరా తీస్తారు ...కాదు మహానుభావా వీటికి సాంకేతిక రుజువులు ఉన్నాయి అని అంటే ....నువ్వు చెప్పెది వినను ....నా అభిప్రాయం ససేమిరా మార్చుకోను అని కళ్ళు చెవులు మూసుకుంటారు ...పైగా అశాస్త్రీయమైన మతపైత్యపు కూతలతో చరిత్ర తిరగరాయాలని కుట్ర చేస్తున్నావు ఆంటూ కట్టె తీసుకుని మీ వెంట పడతారు...

తమ పురాతణ నాగరికత ఇంకా ప్రాచీనమైనవి అని కొత్త ధాఖలాలు కనపడితే చాలు ప్రఫంచంలో మరే దేశం వారయినా ఆ వైనాన్ని గర్వంగా ప్రకటించి. చరిత్ర గ్రంధాలలో వాటిని అర్ఝంటు గా చేరుస్తారు.... తేలిసి తేలియక మనను తక్కువ చెసుకున్నాము సంగతి భావి తరాలకు సంతోషంగా భొధపరుస్తారు... ఇండియా పరిస్తితి అందుకు భిన్నం. మన గొప్ప తనాన్ని లొకమంతా గుర్తించినా మనం మాత్రం ఒప్పుకోము ,,, తప్పు అని తేలాక కూడా పరమ పవిత్రమనుకునే మన చరిత్ర గ్రంధాల్లో అక్షరం మార్చడానికి మనం ఇష్టపడం.....




@@@ అది తేడా @@@
గతం మరచిన జాతికి భవిష్యత్తు చీకటి ...... మనం ఎవరమో, ఎప్పుడు ఎక్కడ బయలు దేరామో .....బతుకు దారిలో ఎలాంటి కష్టాలు పడ్డామో ఏ గొప్పలు చూశామో , ఏ తప్పులు చేశామో తెలిస్తే తప్ప గత కాలం గురించి సరయిన అవగాహన కలగద.గతం తెలియనిదే వర్తమానం అర్ధం కాదు.భవిష్యత్తు దారి దొరకదు ..

దారి దీపం కావలిసిన భారత చరిత్ర విదేశేయుల చేతుల్లో అష్టావక్రంగా ఎలా తయారు అయిందో ..... మహాక్రూరులను మహా పురుషులుగా..జాతీయ వీరులను చిల్లర తిరుగుబాటుదారులుగా చిత్రిస్తూ, విద్వంసకులను నిర్మాతలుగా కీర్తిస్తూ కుహనా చరిత్రకారులు ఇన్నళ్ళా మనలిని ఎలా మొసగించారో రుజువు చేసే శాస్త్రీయ విశ్లేషణ...

...... ఏది చరిత్ర ...........

...... ఏది చరిత్ర ...........

శతాబ్దాలుగా చరిత్ర పేరుతో వ్యాప్తిలో ఉన్న అనేక విషయాలను ఆధారాల సహితంగా, సాధికారికంగా తప్పులుగా చూపిస్తుంది. ఆంధ్రభూమి దినపత్రిక లో ఏది చరిత్ర పేరుతో వచ్చిన అనేక వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. ఆర్యుల కాలం నుండి మొగలుల దాకా, భారతదేశ చరిత్ర లోని ముఖ్య ఘట్టాలను విశ్లేషిస్తూ ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్న చరిత్రను విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ ఈ పుస్తకం సాగుతుంది