Friday, November 20, 2009

ప్రఫంచంలో మనకూ మిగతా వారికి తేడా ఏమిటి???

ఓ ఇంగ్లీషు వాణ్ని పిలిచి ఇప్పటిదాకా మీరు అనుకుంటున్న దాని కంటే మీ దేశచరిత్ర కొన్ని వేల యుగముల నాటిది అని చెప్పండి .... మీ నాగరికత ఎంతో గొప్పది .....మీ పూర్వికులు మహామేదావులు అని ఓ జర్మన్ తోనో, రష్యన్ తోనో అనండి... అసలు ప్రఫంచం నాగరికత మీతోనో మొదలయ్యింది... లోకానికి వెలుగు చూపింది మీరే..... అందుకు ఇవిగో రుజువులు అని అని ఏ డచ్చి వాడికో చెవిన వెయ్యండి ...ఎగిరి గంతేస్తారు . సంతోషం పట్టలేక మిమ్మలిని కేగలించుకొని నోట్లో చక్కేర పోస్తారు ....ఇదిగో విన్నారా అంటూ ఆ ఊసును ఊరంతా దండోరా వేయడానికి తక్షనమే పరుగు తీస్త్తారు ..

అవే సంగతులు వరసబెట్టి ఓ భారతీయ మేధావికి చెప్పండి. చస్తే నమ్మడు..... మిమ్మలిని ఎగాదిగా అనుమానంగా చూసి సనాతన చాంధసుడిగా....కాషాయంళ్ళ ఏజెంటువా? పురాణాల నుంచి లేచివచ్హావా?? అని చడామడా ఆరా తీస్తారు ...కాదు మహానుభావా వీటికి సాంకేతిక రుజువులు ఉన్నాయి అని అంటే ....నువ్వు చెప్పెది వినను ....నా అభిప్రాయం ససేమిరా మార్చుకోను అని కళ్ళు చెవులు మూసుకుంటారు ...పైగా అశాస్త్రీయమైన మతపైత్యపు కూతలతో చరిత్ర తిరగరాయాలని కుట్ర చేస్తున్నావు ఆంటూ కట్టె తీసుకుని మీ వెంట పడతారు...

తమ పురాతణ నాగరికత ఇంకా ప్రాచీనమైనవి అని కొత్త ధాఖలాలు కనపడితే చాలు ప్రఫంచంలో మరే దేశం వారయినా ఆ వైనాన్ని గర్వంగా ప్రకటించి. చరిత్ర గ్రంధాలలో వాటిని అర్ఝంటు గా చేరుస్తారు.... తేలిసి తేలియక మనను తక్కువ చెసుకున్నాము సంగతి భావి తరాలకు సంతోషంగా భొధపరుస్తారు... ఇండియా పరిస్తితి అందుకు భిన్నం. మన గొప్ప తనాన్ని లొకమంతా గుర్తించినా మనం మాత్రం ఒప్పుకోము ,,, తప్పు అని తేలాక కూడా పరమ పవిత్రమనుకునే మన చరిత్ర గ్రంధాల్లో అక్షరం మార్చడానికి మనం ఇష్టపడం.....




@@@ అది తేడా @@@

No comments:

Post a Comment