Sunday, April 22, 2012

అది కథ..

నాగరిక ఆర్యులను అవసరార్ధం అనాగరికులుగా......నాగరికతల విధ్వంసకులుగా చిత్రించి పిల్లి మొగ్గవేసి, అదే నిజమని చరిత్ర గ్రంధాలలోదబాయించడంతో సమస్య తొలగలేదు.కాలం గడిచే కొద్ది కొత్త కొత్త విశాయాలు శాస్త్రీయ పరిశోదనలలో వెల్లడవడంతో ఆర్య - ద్రావిడ విరోధ సిద్దాంతమే అడుగు ఊడి వైరుధ్యాల బండారం బట్టబయలైంది.హలప్ప తవ్వకాలను సాగించిన సర్ మోర్ట్యర్ వీలర్ గారు శిధిలాల్లో ఇవి అనార్యులవని, అవి ఆర్యులవని అపరహంస వేరుచేసి వీరు ఆర్కియాలజీ వారు దాడికి లోనైన వారని నిగ్గు తేల్చారు. అదే తీర్పును చరిత్ర గ్రంధాల రచయితలందరు ఓదలదాల్చారు.. అయితే ఇటీవల కాలంలో ఆర్కియాలజీ తవ్వకాలలో శోధిస్తే అసలు నిజం బయటపడింది. అదేమిటో సింధు నాగరికత ఫ్రఖ్యాత ఆర్కియాలజిస్ట్ డాక్టరు ఎస్.అర్.రావు మటలలో చదవండి.

హరప్పాలో వీలర్ తవ్వకాల స్ట్రాటిగ్రఫ్హి పరీక్షితే ఆయన పేర్కొన్నరెండు సంస్మ్క్త్ తులు ఏకకాలానివి కావని తేలింది. మొదటి గుంపు దురాక్రమదారులుగా, రెండో గుంపు దాడికి గురిఅయిన వారిగా వీలర్ పరిగణించాడు.. దాడి చేసేవారు వచే సమయనికి దాడికి లోనైన వారు అక్కడ లేరని రుజువు అయ్యింది..మొహొంజొదారోలో జి.యఫ్.డేల్స్ కొత్తగా జరిపిన తవ్వకాలలో, కలాఖండాలు పరీక్షలు అనార్యుల ఊచకోత అబద్దం అని నిరూపించాయి...ఇక గుర్రం,బియ్యం ఎరుగని వారు కబట్టి సింధు ప్రజలు అనార్యులు అన్న వర్గీకరణ విశయానికి వస్తే..రంగపూర్,లొధలలో జరిపిన తవ్వకాలలోనూ, కాళిబంగన్, సుర్కోతదల్లో జె.పి.జొహి...సాగించిన తవ్వకాలలోను గుర్రం,బియ్యం,ఎలుక అన్ని బయట పడ్దాయి. లింగాలు అంటూ మార్షల్,పిగ్గట్ లు చూపించిన వస్తువులేమో కాటాకు వాడే రాతిగుండ్ల శకలాలు.

No comments:

Post a Comment