Friday, June 8, 2012

అదీగాక ఆర్యులు , ద్రావిడులు ఆగర్భ శత్రువులైతే ఆ శత్రుత్వపు చాయలు భారతీయ చరిత్రలో ఎక్కడా కనపడవేమి?? ఆర్యులు బయట నుంచి వచ్చిన దురాక్రమదారులు, వారి మతంతో వారి సంస్క్ర్టితితో మనకు సంబంధం లేదు అని ధక్షిణాది ద్రావిడులు ఎప్పుడైన అనుకున్నారా? ఉత్తరాధి ఆర్యులు ధక్షిణాత్యుల మీద దాడి చేసి దారుణంగా లోంగ తీసుకున్నారన్న ప్రాచీన గాధ ఒక్కటైనా ఉందా? ఉత్తరాధి నుంచి ధక్షిణా పధానికి వచ్హిన తొలి మహర్షి అగస్యుడిని ఇక్కడ వారు అర్చించారె తప్ప అసహించుకోలేదు కదా? వైదిక సూత్రాకారులైన భోధాయన, అపసంబులు.... అర్ష సంస్క్ర్టితికి ఈనాటికి ప్రతహ్ స్మరణీయులైన శంకర, ఆమానుజ, మద్వాచార్యులు ధక్షిణాది వారే కదా? ఆర్యులు, ద్రావిడులు వేర్వెరు జాతులు వారయితే ఆర్యభాష అయిన సంస్క్ర్టతానికి, తెలుగు వంటి ద్రావిడ భాషకు అంత దగ్గర సంబంధం ఎలా పొసగింది? శరీర నిర్మాణంలో కాని, మతపరంగా గాని, సాంస్క్ర్టితికంగా గాని ,ఉత్తర, ధక్షిణ వాసుల మధ్య చరిత్ర కందని కాలం నుంచీ ఎలాంటి వైరుధ్యము లేనప్పుడు ఆర్య - అర్యెతర వివాదం ఎంత మతిలేని రాద్ధాంతం???

No comments:

Post a Comment